About DSP
ప్రియమైన BC/SC/ST ప్రజలకు మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు (DFC) నమస్తే, భీం వందనం. తెలంగాణ ప్రాంతంలో 'ఎంతో కాలంగా, ఎన్నో రూపాల్లో, ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ ఉద్యమాలన్నీ అగ్రకులాల నాయకత్వంలోనే జరిగాయి. అందుకని ఇక్కడ ఎన్నిఉద్యమాలు జరిగినా 10% లేని అగ్రకులాల చేతిలోనే “రాజ్యాధికారం-సంపద” చెక్కు చెదరకుండా ఉంది. 90శాతం మంది BC.SC. ST ప్రజల్ని మాత్రం రాజ్యాధికారం వైపు పోకుండా పక్కా ప్లాన్' తో అణచివేసి పేదరికంలోకి నెట్టారు. ఈ తెలంగాణలో ఇన్ని రాజకీయ ఉద్యమాలు జరిగినా 90% మంది అణగారిన కులాల జీవితం ఎందుకు మారలేదు అంటే..? మూడు కారణాలు 1. ఇక్కడ జరిగిన ఉద్యమాలకు అణగారిన కులాలు నాయకత్వం వహించలేదు. 2. వీరు-‘ఫూలే-అంబేడ్కర్-కాన్షీరాం'లఉద్యమాన్నీ అందుకోలేకపోయారు.3. ఇక్కడ జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు కూడా ఆ అగ్రకులాలే దర్శకత్వం వహించాయి. ఇదీ అసలు కథ. రాజకీయం, రాజనీతి అంటే “రాజ్యపరిపాలన వ్యవస్థ” మరి మన దేశంలో వేల సంవత్సరాల నుండి నూటికి 90% ఉన్న అణగారిన కులాలైన BC/SC/ST ల చేతిలో ఈ రాజకీయ పరిపాలన ఉందా? అంటే లేదు. మన దగ్గర 'రాజ్యం లేదు, జ్ఞానం లేదు, ధనం లేదు, సంపద లేదు, భూమి లేదు'... ఇది ఆనాటి మను వ్యవస్థ. మరి నేడు "భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ గణతంత్రం"పచ్చి దాదాపు 75 సంవత్సరాలు కావస్తుంది కదా మరి ఇందులోకూడా మన ప్రజలకు రాజ్యం, భూమి, జ్ఞానం, ధనం, సంపద లేదు. అంటే ఈ దేశంలో మన జనాభాకు తగ్గట్టుగా మనకి వాటా నాడు లేదు నేడు లేదు. 90% ఉన్న మన అణగారిన కులాల ప్రజలు తమ రక్త మాంసాలు కరిగించి అగ్రకుల రాజ్యానికీ సంపదను సృష్టించి ఇచ్చే శ్రామిక వర్గం మనం. ఆ శ్రామిక ప్రజలను రాజ్య సింహాసనం పై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయడానికే అంబేడ్కర్ నాటి వ్యవస్థ పై యుద్ధం చేసి మన ప్రజలకు "భారత రాజ్యాంగ పటా”ను వ్రాసి ఇచ్చాడు. అదిగో ఆ భారత రాజ్యాంగం ఫలించకుండా ఉండడానికి ఈ అగ్రకుల రాజ్యం 90% జనాభా ఉన్న ఈ అణగారిన ప్రజలపై దాడులు చేసి లొంగదీసుకొని, ఆకర్షణలతో ప్రలోభపెట్టి,మోసం, కుట్రలుచేసి మన చేతిలో ఉన్న వజ్రాయుధంలాంటి 'ఓటు'హక్కుని దొంగిలించుకొని పోతున్నారు. ఆ భారత రాజ్యాంగం ఫలించాలంటే మనం పరిపాలకులమైతేనే సాధ్యం, అప్పుడే రాజ్యాంగ ఫలాలు ప్రతీ పౌరుడికీ అందుతాయి. కానీ 75 ఏండ్ల నుండి భారత రాజ్యాంగాన్ని తమ నియంత్రణలో పెట్టుకొని అది ఆచరణలోకి రాకుండా అణగారిన కులాలను ప్రతి రోజూ హింసిస్తూనే ఉన్నారు. నిజంగా భారత రాజ్యాంగమే పూర్తిగా అమలైతే ఈ దేశం, ఈ తెలంగాణ ఒక భూతల స్వర్గమే. కానీ దాన్ని అమలు చేసే “మనసు, హృదయం, ఖలేజా ఈ అగ్రకులాల పాలకులకు 100% లేదు. అందుకే మన BC/SC/ST ప్రజలే స్వశక్తి తో,స్వధర్మం తో భారత రాజ్యాంగ ఆయుధాలతో మన రాజ్యం కోసం యుద్ధం చేయాలి, "ఫూలే అంబేడ్కర్ మార్గంలో నడుస్తూ, కాన్షీరాం యుద్ధ నీతి-రీతి తో తెలంగాణ రాష్ట్రంలో మన BC/SC/ST ల రాజ్యాన్ని నిర్మించాలి. అప్పుడే మన ప్రజల బానిస సంకెళ్లు తెగి స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవిస్తాము. అప్పుడే మనకు రాజ్యం, భూమి, సంపద,ధనం, జ్ఞానం, వైద్యం అన్నింటిలో భాగస్వామ్యం వస్తుంది, అదే ప్రజాస్వామ్యం. అందుకే మన రాజ్యాన్ని మనం నిర్మించుకోవడానికే మనకోసం కన్నతల్లిలా 'ధర్మ సమాజ్ పార్టీ' (DSP)ఉదయించింది. ఇప్పుడు మన అందరినీ ధర్మ సమాజ్ పార్టీ ఆహ్వానిస్తుంది. రండి కదలండి,కదిలిరండి, కదనరంగానికై అగ్రకుల రాజ్యం పై 'ధర్మ యుద్ధానికి'... అగ్రకుల పార్టీలను ఓడిద్దాం - అణగారిన కులాల ధర్మ సమాజ్ పార్టీని గెలిపిద్దాం- మన రాజ్యాన్ని నిర్మిద్దాం.